
అమెరికా టూర్ ముగించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నిన్న ( మే 22) మైడియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ బీఆర్ఎస్లో చిచ్చు రేపింది. ఎప్పుడూ కవితకు అండగా ఉండే బీఆర్ఎస్ నాయకులు ... ఆమెకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లలేదు. కేసీఆర్ కు రాసిన లెటర్ పై కవిత స్పందన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆశక్తికర చర్చ సాగుతోంది
తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఎయిర్ పోర్ట్ నిండిపోయింది. కవితకు స్వాగతం పలికేందుకు కొత్త బ్యానర్లు కనపడ్డాయి. పార్టీ పేరు లేకుండా .. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కవిత నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేవారు, బ్యానర్లుఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఎక్కడ కేసీఆర్..కేటీఆర్.. హరీశ్‌రావుల ఫొటోలు కనపడలేదు. కవితకు స్వాగతంచెప్పేందుకు వచ్చిన కార్యకర్తలు నీలి రంగు, లేత ఆకుపచ్చ కండువాలతో జాగృతి కార్యకర్తలు వచ్చారు . టీమ్ కవితక్క అంటూ అభిమానులు కటౌట్లు ప్రదర్శించారు.