పద్మారావు గౌడ్ ఇలాకాలో అసాంఘిక కార్యక్రమాలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

పద్మారావు గౌడ్ ఇలాకాలో అసాంఘిక కార్యక్రమాలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

బీఆర్ ఎస్ నేత పద్మారావు గౌడ్ ఇలాకలో ప్రభుత్వ స్కూళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఐదు రోజులుగా జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత.. ముగింపు  సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సిటీలో పలు ప్రాంతాల్లో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, ప్రభుత్వం  సమస్యల పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలని కోరారు. 

సీతాఫల్ మండిలో పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే ఆఫీసు ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను కూలగొట్టి పెట్టిన్రు.. ఇంతవరకు కడ్తలేరు.. ఆ ప్రాంతం ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విలైనంత  తొందరగా స్కూల్ ను కట్టాలని కోరారు. వెయ్యి మంది విద్యార్థులున్న స్కూల్ ను  కొత్త స్కూల్ కడతామని చెప్పి కూలగొట్టడంతో  పిల్లలు చెల్లాచెదురై పోయారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. 350మంది పిల్లలను ఏదో స్కూల్లో చేర్పించారు..మిగతా పిల్లలు ఎక్కడ చదువుతున్నారో కూడా తెలియదని అన్నారు కవిత. ఇప్పటికైనా ప్రభుత్వం స్కూల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కవిత కోరారు. 

మరోవైపు వారాసిగూడ జంక్షన్ లో వెహికల్స్ రద్దీ భయంకరంగా పెరిగిపోయందన్నారు కవిత. చాలా కాలంగా రోడ్డు విస్తరణ చేస్తామన్నారు కానీ ఇప్పటికి అది జరగడం లేదని అన్నారు. 1950లో హైదరాబాద్ ట్రాఫిక్ కు సరిపోను ఉన్న రోడ్డు .. ఇప్పటి రద్దీతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీలైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. 

మరోవైపు అడిక్ మెట్టులో  తాగు నీటి సమస్యలు దారుణంగా ఉందన్నారు కవిత..మంచినీటిలో పెట్రోల్ వాసన వస్తోంది.. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కవిత కోరారు.