ఆదివారం ( జనవరి 25 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు పెట్టారని అన్నారు. మెగా కృష్ణారెడ్డికి నైనీ బొగ్గు బ్లాకును కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు కవిత.రాష్ట్రంలో కొత్త ట్రెండ్ రాజకీయాల్లో స్టార్ట్ అయిందని.. ఒక దళిత మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ను ఉద్దేశించి వార్తలు వేయడంతో ఇది స్టార్ట్ అయిందని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులను అరెస్టు చేశారని.. కాంగ్రెస్ పార్టీ లైన్ అతిక్రమించి శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులను అరెస్టు చేసిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీపై వార్తలు వేస్తే ఒక ఛానల్ పై దాడి చేశారని..అదే మహిళా అధికారి పట్ల వార్తలు వేసిన ఛానల్ కు అనుకూలంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు కవిత. మహిళలపై అంత చిన్న చూపు ఎందుకో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక పేపర్ లో వార్త వస్తే భట్టి ప్రెస్ మీట్ పెట్టారని...ఆ తర్వాత గుంట నక్క ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు.భట్టి మాట్లాడిన తర్వాత కేటీఆర్ మాట్లాడారని అన్నారు.మేము రెండేళ్లలో అనేక సింగరేణి సమస్యలపై మాట్లాడితే భట్టి ఒక్కరోజు కూడా మాట్లాడలేదని అన్నారు. నైనీ బొగ్గు బ్లాకు 2015లో సింగరేణికి కేటాయించారని.. బిఆర్ఎస్ హయాంలో,ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయని అన్నారు.
విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారని.. తిమింగళాన్ని వదిలిపెట్టాలని గుంట నక్క ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కవిత. మెగా కృష్ణారెడ్డికి నైనీ బొగ్గు బ్లాకును కట్టబెట్టాలని చూస్తున్నారని.. మెగా కృష్ణారెడ్డిని గుంట నక్క కాపాడుతున్నారని అన్నారు కవిత. మార్చిలో ఉద్యోగులకు సింగరేణి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. భట్టి విక్రమార్కకు లేఖ రాస్తానని.. సింగరేణిలో ఎం.డి.ఓ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నానని అన్నారు.
నైనీ బొగ్గు బ్లాకును 25 ఏళ్లకు అవినీతి తిమింగళానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. బీఆర్ఎస్ డొల్లతనాన్ని తామే బయటపెడతామని అన్నారు. తెలంగాణ,ఏపీలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని...దీనిపై కిషన్ రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు కవిత. బిఆర్ఎస్ ప్రజల పక్షంగా వుండాలి కానీ...కాంట్రాక్టర్ల పక్షం కాదని అన్నారు.
