కార్పొరేట్ స్కూళ్లతో సర్కారు లాలూచీ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కార్పొరేట్ స్కూళ్లతో సర్కారు లాలూచీ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  •     ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ పెట్టాలి: కవిత

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్  విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్  చేశారు. కార్పొరేట్  విద్యా సంస్థల లాబీతో ప్రభుత్వానికి లాలూచీ ఏంటని ప్రశ్నించారు. వారితో ఏవైనా  ఒప్పందాలు ఉన్నాయా? లేదంటే రహస్య అజెండా ఉందా అని నిలదీశారు. 

పేద, మధ్యతరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్  విద్యా సంస్థల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమెందుకని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్  సమావేశాలు నిర్వహించినప్పుడు.. లక్షలాది పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదన్నారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు.