రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..నేడు (మే 13) విచారణకు రావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశం 

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..నేడు (మే 13) విచారణకు రావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రైల్ రోకో కేసులో విచారణకు హాజరుకావాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌ఎస్) చీఫ్ కవితకు సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌‌తో నిరుడు నవంబర్ 28న కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టి దేవగిరి ఎక్స్‌‌ప్రెస్‌‌తో పాటు మరో గూడ్స్ రైలును నిలిపేశారు. ఈ ఘటనపై కవిత సహా 12 మంది టీఆర్‌‌‌‌ఎస్ నాయకులపై ఏఎస్‌‌ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరుకావాలని సమన్లలో రైల్వే కోర్టు పేర్కొంది.