హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈ నెల 20 నుంచి నెల రోజులపాటు జెండా పండుగ నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 20 వరకు రాష్ట్రంలోని ప్రతి వార్డులో పార్టీ జెండా ఎగరేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్రం ఆవిర్భవించి, 12 ఏండ్లు గడిచినా తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు.
