జన్నారం, వెలుగు: హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 60 మంది ట్రైనీ రేంజ్ ఆఫీసర్లు ఆదివారం కవ్వాల్ టైగర్ జోన్‌లో పర్యటించారు.
అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ మంజుల ఆధ్వర్యంలో జన్నారం రేంజ్ పరిధిలోని గొండుగూడ గేట్ నుంచి కాలినడకన టైగర్ జోన్‌లోని బైసన్ కుంట వరకు వెళ్లారు. అటవీ సిబ్బంది విధులను పరిశీలించారు. మొక్కలు, జంతు జాతుల గురించి తెలుసుకున్నారు.
అడవిలో చేపట్టిన అభివృద్ధి పనులు, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలపై జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ వారికి వివరించారు. జన్నారం రేంజ్ ఆఫీసర్ బాబా ఖాదర్ వలి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, చింతగూడ ఎఫ్‌ఎస్‌వో రవినాయక్, బీట్ ఆఫీసర్ సంతోష్ తదితరులు ఉన్నారు.
