
- 12.7 కిమీ విద్యుద్దీకరణ పూర్తి
హైదరాబాద్, వెలుగు: కాజీపేట– బల్హార్ష మూడో లైన్ విస్తరణ, విద్యుద్దీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. హసన్ పర్తి రోడ్ ఉప్పల్ల మధ్య 12.7 కిమీ మూడో ట్రాక్, విద్యుద్దీకరణ పూర్తయిందని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం తెలిపింది. తెలంగాణ, మహారాష్ర్టలో కలిపి మొత్తంగా 202 కి.మీ మేర రూ.2063 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
2015 –16 లో ఈ ప్రాజెక్టు శాంక్షన్ కాగా, ఇప్పటి వరకు 131.7 కి.మీ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నార్త్, సౌత్ ప్రాంతాలను కలిపే కీలక ప్రాజెక్టు అని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల వేగం పెరిగి, రద్దీ తగ్గుతుందని వెల్లడించారు. హసన్ పర్తి– ఉప్పల్ ప్రాజెక్టు పూర్తి చేసిన సికింద్రాబాద్ డివిజన్ కన్ స్ర్టక్షన్ అధికారులను దక్షిణ మధ్యరైల్వే జీఎం అరుణ్ కుమార్ అభినందించారు.