
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశానికి అరుణ్ జైట్లీ చేసిన సేవలు మరిచిపోలేనివని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో దేశం కోసం ఎంతో సేవ చేశారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు.