నదికి నడక నేర్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్

నదికి నడక నేర్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్
  • ప్రతి పక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు
  • కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: నదికి నడక నేర్పిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీశ్ రావు. బుధవారం జిల్లాలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... నదిలేని చోట.. ఇంత పెద్ద జలాశయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదన్నారు. అలాంటి  సుసాధ్యాన్ని సాధ్యం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పొగిడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చాలా ప్రయత్నించాయన్నారు. దాదాపు 350 కేసులు పెట్టి ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా.. కేసీఆర్ పట్టుదలతో ప్రాజెక్ట్ ను పూర్తి చేశారన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు సమస్య శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని అన్నారు. ఈ జలాశయం ద్వారా పది జిల్లాలకు సాగు, తాగు నీరు అందునుందన్నారు. నాడు సమైఖ్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలంలా ఉండేదని, కానీ నేడు స్వరాష్ట్రంలో ఎండా కాలం కూడా వాన కాలంలా కనిపిస్తుందన్నారు. మల్లన్నసాగర్ ట్రయల్ రన్ సమయంలో కూడవల్లి, హల్దీ వాగుల ద్వారా నీరు వదిలితే కోట్లాది రూపాయల పంట పండిందని, ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపించాయన్నారు. కేసీఆర్ దయ వల్ల వడ్లు పండాయని, అందుకే రైతులు ప్రేమగా వాటిని ‘కేసీఆర్ వడ్లు’ అని పిలుస్తున్నారన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం..

బీజేపీని అణిచివేసేందుకు కేసీఆర్ కుట్ర