టీమ్ కేసీఆర్..రాజ్ భవన్ లో 10 మంది మంత్రుల ప్రమాణం

టీమ్ కేసీఆర్..రాజ్ భవన్ లో 10 మంది మంత్రుల ప్రమాణం

హైదరాబాద్ : రెండు నెలలుగా రాజకీయ వర్గా ల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన రాష్ట్ర కేబినెట్ విస్తరణ పూర్తయింది . మంగళవారం పదిమంది కొత్త మంత్రులు కొలువుదీరారు. ఆ వెం టనే వారికి శాఖల కేటాయింపులు జరిగిపోయాయి . శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేసీఆర్ టీమ్ రెడీ అయింది . కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం రాజ్ భవన్ లో జరిగింది . ఈటల రాజేందర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యా దవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ , వేముల ప్రశాం త్ రెడ్డి, చామకూర మల్లారెడ్డితో గవర్నర్ నరసిం హన్ మంత్రులకు ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు గవర్నర్‌, సీఎం ఆశీర్వా దం తీసుకున్నారు.

ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైన వేడుక 11.54 గంటలకు ముగిసింది . పది మంది కొత్త మంత్రుల్లో రెడ్డి సామాజిక వర్గా నికి చెందిన వారు ఐదుగురు, బీసీలు ముగ్గు రు(ముది రాజ్, యాదవ, గౌడ), వెలమ ఒకరు, ఎస్సీ(మాల) ఒకరు ఉన్నారు. డిసెంబర్ 13న సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేశారు. అదేరోజు మహమూద్ అలీ కూడా ప్రమాణం చేయగా.. ఆయనకు హోంశాఖ కేటాయించారు. ఇప్పటివరకు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నిం టినీ కేసీఆరే దగ్గరుండి చూస్తూ వచ్చారు. తాజా విస్తరణ తర్వాత సీఎం సహా కేబినెట్ మినిస్టర్స్ సంఖ్య 12కు చేరింది . కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే మిగిలిపోయాయి . లోక్ సభ ఎన్ని కల తర్వాత మరో విడత విస్తరణ ఉంటుందని అంటున్నారు.