హైదరాబాద్ భూములమ్మైనా పాలమూరు పూర్తి చేస్తాం

హైదరాబాద్ భూములమ్మైనా పాలమూరు పూర్తి చేస్తాం

ఏడెనిమిది నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. వచ్చే వర్షాకాలం నాటికి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లిస్తామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలపై ఏదుల రిజర్వాయర్ దగ్గర సీఎం సమీక్ష నిర్వహించారు. పాలమూరులో 15 నుంచి 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని తెలిపారు. ఇకపై రెగ్యూలర్ పాలమూరు పనులపై సమీక్ష చేయడంతో పాటు.. అప్పుడప్పుడు వచ్చి వెళ్తానన్నారు.  హైదరాబాద్ లో విలువైన భూములు అమ్మకానికి పెట్టామని.. ఆ నిధులన్నీ పాలమూరుకే ఖర్చు చేస్తామన్నారు కేసీఆర్. పాలమూరు.. పాలుగారే ఊరుగా మారుస్తామని హామీ ఇచ్చారు.

ఇక త్వరలో గోదావరి-కృష్ణా లింక్ చేస్తామని చెప్పారు కేసీఆర్. గోదావరి అనుసంధానంపై ప్రణాళిక జరుగుతోందని.. మరో నెలన్నరలో దీనిపై ముందడుగు పడే అవకాశం ఉందన్నారు.  కృష్ణా-గోదావరి లింక్ పై చంద్రబాబుది అసత్య ప్రచారమని మండిపడ్డారు. కృష్ణా-గోదావరి లింక్ పై అగ్రిమెంట్స్ చేసుకునే ముందుకెళ్తామన్నారు. గత పాలకులు పాలమూరును కరువు జిల్లాగా మార్చారని.. తాము.. పచ్చని పంటల జిల్లా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. అంతకుముందు పాలమూరు ఎత్తిపోతలలోని రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాలువ పనులు చూశారు సీఎం. ముందుగా.. కరివెన రిజర్వాయర్ కు వెళ్లి ఏరియల్ వ్యూ చేశారు. ఆ తర్వాత వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను పరిశీలించి.. ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ చేశారు.