కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం : బండి సంజయ్

V6 Velugu Posted on Jul 09, 2020

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసార్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది కాబట్టే.. కరోనా కట్టడికి గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా గవర్నర్‌ ఆస్పత్రులను పరిశీలించిన పరిస్థితి లేదని తెలిపారు. గవర్నర్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రులను పరిశీలించారని, ప్రైవేట్  ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారని అన్నారు సంజయ్.

Tagged Bandi Sanjay, KCR government, failure, curb corona

Latest Videos

Subscribe Now

More News