అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్

అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది : బండి సంజయ్

నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారని చెప్పారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకూడదనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కనుమరుగు చేశారని చెప్పారు. 

వెయ్యి ఉరుల మర్రి చరిత్రను సమాజానికి తెలియజేసిన వ్యక్తి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అని చెప్పారు. రాంజీ గుండు పోరాటస్ పూర్తి మరువలేనిదని తెలిపారు. ఒక వర్గం ఓట్ల కోసం చారిత్రక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేశారని  గత ప్రభుత్వం తిరుమలగు చేయాలని ప్రయత్నం చేసిందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పారు.  

రాంజీ గుండు శృతి వనం కోసం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోరాటం చేస్తారని తెలిపారు. వచ్చే సంవత్సరం శృతి వనం ఘనంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిదులు సహకరించాలి, ఓట్ల కోసం రాజకీయం చేయకుండా వనం ఏర్పడు కోసం సహకరించాలని కోరారు.