కరోనా కట్టడిలో KCR ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించలేదు: గవర్నర్ తమిళిసై

V6 Velugu Posted on Aug 18, 2020

కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదన్నారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు  తమిళిసై అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ. సూచనలు చేస్తూ. ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని…ప్రభుత్వం సమర్ధించుకుంటోందన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా. ప్రభుత్వాస్పత్రుల పై రోగులు ఆసక్తి చూపట్లేదన్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని తమిళిసై  ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

Tagged KCR government, Governor Tamilsai, curbing corona, not active

Latest Videos

Subscribe Now

More News