పాలమూరు-రంగారెడ్డికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి లేదు : భట్టి విక్రమార్క

పాలమూరు-రంగారెడ్డికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి లేదు : భట్టి విక్రమార్క

రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడెం మండలం గుంజల్ పహాడ్ గ్రామంలో మంగళవారం( మే16) భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. రంగారెడ్డి జిల్లాలో పూర్తి చేసుకున్న సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర  మహబూబ్ నగర్ జిల్లాలోకి ఎంటరైంది. 

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రజలను మభ్యపెట్టి   బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు దండుకొంటుందని ఆరోపించారు. ప్రాజెక్టును కేసీఆర్  ఏటీఎం లాగా వాడుకుంటున్నారన్నారని విమర్శించారు.  గతంలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను సందర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను  ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. 

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వరా ?

రైతులకు ఇన్పుట్ సబ్సిడీలను ఇవ్వకుండా  ఎకరానికి 5వేల రూపాయిలు  ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదన్నారు సీఎల్పీ నేత.   పెరిగిన ధరలకు రైతుబంధు ఏ మాత్రం ఊరట కలిగించదన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. 2024 లోపల  రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.