కేసీఆర్ షో చేస్తూ పాలిస్తున్నాడు.. బీఆర్ఎస్ హయాంలో అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

కేసీఆర్ షో చేస్తూ పాలిస్తున్నాడు.. బీఆర్ఎస్ హయాంలో అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

కాంగ్రెస్‌ హయాంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలు తీయించి గోదావరి జలాలు రప్పించారని  అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ఫలితంగానే  అప్పట్లోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు  సాగు నీరు వస్తుంటే ...బీర్ఎస్ నేతలు మాత్రం కాళేశ్వరం, మేడిగడ్డ అన్నారం సుందిళ్ల నుండి వస్తున్నాయని జలహారతి అంటూ షో చేస్తూ పాలన కొనసాగిస్తున్నారన్నారు సీఎల్పీ లీడర్ భట్టి.  కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఎకరాల భూమి సేద్యం అవుతుందో .. ఇప్పుడు కూడా అదే అవుతుందని .సూర్యాపేట జిల్లాకు కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టి అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం కేసీఆర్ దని  దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి: ప్రధాని మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

 మంత్రి జగదీష్‌ రెడ్డి.. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ఎస్సెల్బీసీ టన్నెల్‌, డిండి ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లాకు నీరు కూడా తీసుకురాలేదన్నారు. అప్పట్లో కేసీఆర్‌ ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని మూసీ నదిలో పూడిక తీయిస్తానని చెప్పారని.. ఇంత వరకు పూడిక తీయించలేదన్నారు.  ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కట్టిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వ ద్వారా, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, మిడ్‌ మానేరు నుంచి వస్తున్న నీళ్లు అని చెప్పడంలేదన్నారు. అంతేకాక మేము తవ్విన కాకతీయ కాలువ ఫేజ్‌ 2ను విస్తరించడంతో ఇక్కడికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ఆ నీళ్ల దగ్గరికెళ్లి పూలు, కుంకుమ జల్లి కేసీఆర్‌ నీళ్లని చెబుతుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. నీళ్లు, ప్రాజెక్టుల గురించి తెలియని ప్రజలను పదేళ్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తోందని పేర్కొన్నారు. 

 దశాబ్ద కాలంలో అన్ని రంగాల్లో  కేసీఆర్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టి అన్నారు.  గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా రాజకీయాల కోసం వారి సొంత ఆస్తులను పోగొట్టుకున్నారు తప్ప కూడా కట్టుకోలేదన్న ఆయన.. సీఎం కేసీఆర్  మాత్రం ప్రజాధనంతో  ఫాం హౌస్  నిర్మించుకోవడమే కావడమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారనని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు.