
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. కాళేశ్వరంపై ఇప్పటికే నివేదిక పూర్తయింది. దాదాపు 4 వందల పేజీల రిపోర్ట్ ను కమిషన్ తయారు చేసింది. మే 22 నుంచి 24 మధ్య ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చే చాన్స్ ఉంది.
అయితే రాజకీయ నేతలను బహిరంగ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్,హరీశ్,ఈటలె రాజేందర్ కు బహిరంగ విచారణ తప్పినట్టైంది. డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉండటంతో పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ గడువు మే 31 తో ముగియనుంది.
ALSO READ | నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నరు: కొండా సురేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను తేల్చేందుకు 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్జడ్జి జస్టిస్పీసీ ఘోష్చైర్మన్గా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో మొదటి కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా అధికారులు, నిపుణులను విచారించి.. దాదాపు 400 పేజీలకు పైగా నివేదిక రెడీ చేసింది కమిషన్. తుది దశ విచారణలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారిస్తుందనే చర్చ జరిగింది. అయితే లేటెస్ట్ గా కమిషన్ గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలవొద్దనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.