తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగిరేసిన కేసీఆర్

తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఎగిరేసిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జెండా ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి దండం పెట్టారు. ప్రొ. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేటితో టీఆర్ఎస్ పార్టీ 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ సారి పార్టీ ఆవిర్భావ వేడుకలు టీఆర్ఎస్ దూరంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా సీఎం కేసీఆర్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ…మాస్క్ కట్టుకొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కూడా తక్కువ మంది నేతలే వచ్చారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి లు పాల్గొన్నారు. ఐతే టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇళ్ల వద్ద పార్టీ జెండాను ఎగురవేసి ఉత్సవాలు జరుపుకోనున్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించిందన్నారు. ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని…దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్ఎస్‌ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.