కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నడు : విశారదన్ మహారాజ్

కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నడు : విశారదన్ మహారాజ్
  •     రెండేండ్ల తరువాత బయటికొచ్చి నీళ్ల గురించి మాట్లాడుతుండు: విశారదన్ మహారాజ్
  •     సామాజిక న్యాయం అందుకునే వరకు ఊరుకోబోమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల తరువాత ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు వచ్చి మళ్లీ నీళ్ల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి సెంటిమెంట్ రగిలిస్తుండని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ ఆరోపించారు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ త్యాగాలతో 10 ఏళ్లు వెలమ రాజ్యాన్ని ఏలిన తరువాత, అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ వెలమ రాజ్యస్థాపన కోసం ఇపుడున్న ప్రభుత్వంపై గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నీటి వాటాలు అంటూ చెప్పిన లెక్కలే మళ్లీ మళ్లీ చెబుతూ రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొడుతున్నారని సోమవారం పత్రిక ప్రకటనలో విశారదన్ మండిపడ్డారు. 

రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, న్యాయ, రాజ్యాధికారాల్లో వాటా కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వర్గాల వాళ్లు సామాజిక రాజకీయ విప్లవాన్ని కోరుకుంటున్నారన్నారు. సామాజిక న్యాయం అందుకునే వరకు ఈ మూడు వర్గాల ప్రజలు ఊరుకోరని, కేసీఆర్​పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.  అగ్రకులాల పార్టీలు, నేతల మాయలో నుంచి బయట పడి ఇపుడిపుడే సొంత దారిని, సొంత ధర్మాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలు తెలుసుకుంటున్నారని విశారదన్ తెలిపారు.