
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును తక్కువ ధరకే లీజ్ కి ఇచ్చారని చెప్పారు. ఎప్పుడూ కూడా అంబేద్కర్ ఫోటోకు, విగ్రహానికి దండ వేయని కేసీఆర్.. బీఎస్పీ కి భయపడే సీఎం కేసిఆర్ ..125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టారని తెలిపారు. తాను బీఎస్పీలో చేరిన తర్వాతే దళిత బంధు ప్రవేశపెట్టారని చెప్పారు. దళిత మహిళను సీఎస్ కాకుండా సీఎం కేసిఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసిఆర్ కు దమ్ముంటే దళిత బంధులో కమిషన్ లు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు ఏసీబీ కి ఇవ్వాలి సవాల్ విసిరారు. రైతులు పంట నష్ట పోయి కష్టాలు పడుతుంటే కేసిఆర్ ప్రగతి భవన్ లో మహారాష్ట్ర వాళ్ళను పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీని అడ్డుపెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ విజయ పాలను బంద్ చేసి గుజరాత్ అమూల్ వాళ్లకు పాల కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా పెట్టారని మండిపడ్డారు.
ప్రతీ నెల ఒకటో తేదీన జీతం తీసుకునే కేసీఆర్..ఉద్యోగులకు మాత్రం 10వ తేదీన జీతాలు వేస్తున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిజమైన వార్తలు రాసే పేపర్లు..టీవీలను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం..అధికారం కోసం గజ్జె కట్టిన తామే...అన్యాయం జరిగితే గళ్లా పట్టి తంతామని ఘాటుగా హెచ్చరించారు. బీఎస్పీ అధికారంలోకి 10 లక్షల ఉద్యోగాలు, భూమి లేని వారికి ఒక ఎకరం భూమి ఇస్తామన్నారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులకు పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. . గల్ఫ్ కార్మికుల కోసం 5000 కోట్ల నిధులు కేటాయిస్తాము..
మైనార్టీల రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోమ్ మంత్రి చెప్పడం దారుణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మళ్లీ ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగురవేయడం ఖాయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ను దోపిడీ దొరల నుండి విముక్తి చేయడం కోసం అందరం ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 213 రోజులు తెలంగాణలో పర్యటించానని...కానీ .అధికార పార్టీ వాళ్ళు ఎన్ని సార్లు అడ్డుకున్న పర్యటన ఆపలేదన్నారు. చాలా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను,సీఎం కేసిఆర్ ను చూడలేదని ప్రజలు చెప్పినట్లు వెల్లడించారు.