ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన బాధ్యుడు కేసీఆరే : జీవన్ రెడ్డి

 ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన బాధ్యుడు కేసీఆరే : జీవన్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ట్యాపింగ్ లో ప్రధాన బాద్యుడు కేసీఆరేనని అన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ స్వయంకృపారాధం వల్లే అధికారం కోల్పోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.

 దేశంలో ప్రధాని మోదీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో ఆంధ్రా సినిమాలకు పన్ను మినహాయింపు ఇచ్చిన బీఆర్ఎస్.. ఇప్పుడు రాష్ట్రగీతాన్ని కీరవాణితో పాడించడాన్ని తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు జీవన్ రెడ్డి. అన్ని వర్గాల్లో ఆర్థిక వెనుకబడిన వారికి EWS రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.  SC, ST, BC లకు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోదీ అని విమర్శించారు జీవన్ రెడ్డి.