రైతుల గందరగోళానికి కేసీఆరే కారణం

 రైతుల గందరగోళానికి కేసీఆరే కారణం
  • హుజూరాబాద్ ఎన్నికల టెన్షన్ లో మర్చిపోయి ఇప్పుడు హడావుడి చేస్తున్రు
  • బీజేపీ ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు గందరగోళం కావడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. బాయిల్డ్  రైస్ ఇవ్వబోమని కేసీఆర్ సంతకం చేసి రాసిచ్చారని చెప్పారు. డిసెంబర్ 5వ తేదీ వచ్చినా రైతులు ఏ పంటలు వేయాలో ఇంత వరకు స్పష్టంగా చెప్పలేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో పడి రైతులకు ఏం చేయాలో దిశా నిర్దేశం చేయలేదని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి మక్క కొనమని చెబుతూనే వస్తున్నారు.. చెరకు ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి తెరిపించలేదు. పసుపు రైతులకు నయా పైసా సాయం చేయలేదు. మహిళా సంఘాలకు అప్పచెబుతానని.. అందరినీ వరి పంట వైపు మళ్లేలా చేసింది కేసీఆర్ అని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ప్రత్యామ్నాయం ఏ పంట వేయాలో ముందే చెప్పకుండా.. ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తానని హెచ్చరికలు చేయడం వల్ల ఏం లాభం అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోవడంతో తన కుర్చీ యాడ జారిపోతుందోనని బెంగ పట్టుకుందన్నారు.  రాష్ట్రంలో మక్క, చెరుకు, పసుపు రైతులను వరివైపు మళ్లించిందే ఆయనేనన్నారు. కేసీఆర్ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసినా బీజేపీకి నష్టం లేదన్నారు అర్వింద్.