మన వలసలకు కారణం కేసీఆరే : సీఎం రేవంత్ రెడ్డి

మన వలసలకు కారణం కేసీఆరే : సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మన వలసలకు కారణం కేసీఆరే అని అన్నారు.  కేసీఆర్ ను కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్ నగర్ కు వచ్చి ఎంపీగా పోటీ చేశారని విమర్శించారు. ఇక్కడి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే సభకు రాకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణా నది జలాల పై చర్చ జరుగుతుంటే రాకుండా ఫాం హౌజ్ లో దాచుకున్నారని విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు. 

ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి తామంత ఒక్కతాటి పైనే ఉన్నామని కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని చెప్పాల్సిన సమయంలో అసెంబ్లీకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.  దొంగ బుద్ది మానుకొని తెలంగాణ బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. పద్మారావు గౌడ్ ను ప్రతిపక్ష నేతగా పెడితే తెలంగాణ ప్రజానికానికి మేలు కలుగుతుందని అన్నారు. 

ALSO READ :- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ కళ్లు మూసుకున్నాడు : మంత్రి ఉత్తమ్