రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ కళ్లు మూసుకున్నాడు : మంత్రి ఉత్తమ్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ కళ్లు మూసుకున్నాడు : మంత్రి ఉత్తమ్

శ్రీశైలం ప్రాజెక్టునే కాదు.. ఏకంగా కృష్ణా నదినే ఏపీకి ఎత్తుకెళ్లే విధంగా.. ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే.. కేసీఆర్ ప్రభుత్వం.. కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారని తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్టులో.. 797 లెవల్ దగ్గర.. పెద్ద పంపులు పెడుతున్నారని.. శ్రీశైలం డ్యాం కింద రంధ్రాలు వేసి మరీ నీళ్లు ఎత్తుకెళ్లటానికి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఎం జగన్ కడుతుంటే.. కేసీఆర్ నిమ్మకునీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయారని.. ఆ లిఫ్ట్ పూర్తయితే.. రోజుకు 8 టీఎంసీలు ఎత్తుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు కాదు.. ఏకంగా కృష్ణా నదినే ఏపీ వైపు మళ్లించే అవకాశం ఉందని.. శ్రీశైలంపై ఆధారపడిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వీర్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. 

2020లో ఏపీ ప్రభుత్వం జీవో 203 రిలీజ్ చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టిందని.. ఈ ప్రాజెక్టును పూర్తయితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీటి సమస్యలు వస్తాయన్నారు. శ్రీశైలంలో బురద కూడా ఉండదని.. చుక్క నీరు లేకుండా ఏపీ బలదోపిడీకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే.. కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారాయన.

ALSO READ :- రూ. 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి.. చుక్క నీళ్లు తేలే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జగన్, కేసీఆర్ దోస్తీ వల్ల నీళ్ల విషయంలో తెలంగాణకు చరిత్రలో జరగనంత దోపిడీ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదని.. కేసీఆర్ హయాంలో.. ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం తెలంగాణకు జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్.