రూ. 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి.. చుక్క నీళ్లు తేలే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రూ. 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి.. చుక్క నీళ్లు తేలే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ నేతల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి చుక్క నీళ్లు కూడా  తీసుకరాలేదని అన్నారు. అసెంబ్లీలో ఇరిగేషన్ పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డికి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్ దాన్ని  పట్టించుకుని ఉంటే ప్రాజెక్టు నీళ్లు పరుగులు పెట్టేవని అన్నారు. 

ALSO READ :- 299 టీఎంసీలకు.. ఏడేళ్లు వరుసగా ఎలా ఒప్పుకున్నారు : మంత్రి ఉత్తమ్

రాయలసీమ ఎత్తిపోతలకు 2020లో జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల టెండరింగ్ ప్రక్రియ సాఫీగా సాగడానికే కేసీఆర్ సహకరించారని అన్నారు. 2020 ఆగస్ట్ నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ అడ్డుకోలేదని చెప్పారు. కేసీఆర్ అభ్యంతరం చెప్పి ఉంటే నేటి సమావేశం వాయిదా పడేదని అన్నారు. కేసీఆర్ అభ్యంతరం చెప్పి ఉంటే పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెట్టి ఉండేదని కానీ ఆయన అలా చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.