తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ డుమ్మా

 తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ డుమ్మా

హైదరాబాద్: ప్రభుత్వం సచివాలయం  దగ్గర ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ కాలేదు. డిసెంబర్9న  ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సెషన్ కు కూడా కేసీఆర్ రాలేదు.  సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహావిష్కరణ చేసే సమయానికి కొంచెం అటు, ఇటూగా..  మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పాత తెలంగాణ తల్లి (బీఆర్ఎస్ వారు ఏర్పాటు చేసిన) విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్  ప్రసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించి అధికారికంగా ప్రకటిస్తూ గవర్నర్ సంతకంతో గెజిట్  జారీ చేసింది. 

ALSO RAED | ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణతల్లి అవతరణ ఉత్సవాలు: సీఎం రేవంత్ రెడ్డి

 

ఈ కార్యక్రమానికి రావాలని  రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి పొన్నం  ప్రభాకర్ స్వయంగా ఎర్ర వెల్లి ఫాంహౌస్ కు వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పొన్నం ఆహ్వాన పత్రికలు అందించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ అదే సమయంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఆవిష్కరణ పెట్టడం గమనార్హం. ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవుతుండటం మరో మారు చర్చనీయాంశంగా మాంది.