రూపాయికే రిజిస్ట్రేషన్‌.. అక్రమంగా నిర్మిస్తే కూల్చుడే

రూపాయికే రిజిస్ట్రేషన్‌.. అక్రమంగా నిర్మిస్తే కూల్చుడే

అర్బన్‌ లోకల్‌‌ బాడీస్‌‌లో పారదర్శకత, అవినీతి నిర్మూలన కోసం కొత్త మున్సిపల్‌‌ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 75 చదరపు గజాలలోపు ఇంటి నిర్మా ణానికి అనుమతి కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నా రు. కానీ వివిధ సంక్షేమ పథకాలు పొందేం దుకు మున్సిపాలిటీలో ఎన్‌ రోల్‌‌ చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. వారు ఏడాదికి రూ.1-00 ఆస్తి పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నా రు.

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తో ఇంటి పర్మిషన్‌

500 చదరపు మీటర్లలోపు స్థలంలో 10 మీటర్ల ఎత్తు లో నిర్మించే భవనాలకు సెల్ఫ్‌‌ డిక్లరేషన్‌ తో పాటు ఇంటి ప్లాన్‌ పెట్టి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేస్తే.. ఆన్‌ లైన్‌ లోనే పర్మిషన్‌ ఇస్తారని, ఇందుకోసం ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదని, ఏ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలే దని సీఎం స్పష్టం చేశారు. నిర్ణీత టైం లోగా పర్మిషన్​ ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావిం చి ఇల్లు కట్టుకోవచ్చన్నారు. అయితే.. అన్నీ నిబంధనల ప్రకారం ఉండాల్సిం దేనని స్పష్టం చేశారు. ‘‘ప్రాపర్టీ ట్యాక్స్​కు సెల్ఫ్‌‌ డిక్లరేషన్‌ పెట్టినం. ఇంటి యజమాని తన ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉందో అందులో చెప్పాలి. చూపిన కొలతల్లోనే ఇల్లు ఉండాలి. ప్రతి ఇంటిని కలెకర్్ట ఆధ్వర్యంలోని ఫ్లయిం గ్ స్క్వాడ్స్​ కొలుస్తాయి. ఆ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే ఒకేసారి 25 రెట్ల ఫైన్‌ తోపాటు అసలు పన్నును వసూలు చేస్తరు” అని స్పష్టం చేశారు. ఇక మీదట లేఅవుట్లకు అనుమతి కలెక్టర్లే ఇస్తారని, వీటి విషయంలో మున్సిపాలిటీలకు ఎలాంటి అధికారం ఉండదని, లేఅవుట్ల నిర్మా ణంలో నిబంధనల ఉల్లం ఘన జరగకుం డా కలెక్టర్‌‌ చైర్మన్‌ గా ఉండే జిల్లా ఎన్ఫోర్స్‌‌మెం ట్‌ అథారిటీ చూస్తుం దని పేర్కొన్నా రు.

అక్రమంగా నిర్మిస్తే కూల్చుడే

‘‘మేం ప్రజలను నమ్ముతు న్నం . వాళ్లకు హరాస్‌‌మెం ట్‌ పోవాలని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రజలను నమ్మి ఆ అధికారం వారికే ఇస్తున్నం . సెల్ఫ్‌‌ సర్టిఫికేషన్‌ ను భగవద్గీత అనుకోవాలి. అంతే పవిత్రతతో పౌరబాధ్యతను నెరవేర్చాలి” అని సీఎం కేసీఆర్ సూచిం చారు. రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌ (బిల్డిం గ్ రెగ్యు లరైజేషన్​ స్కీం) ఓ ప్రహసనంగా మారిం దన్నా రు. ‘‘డబ్బు లు తీసుకుని అక్రమ కట్టడాలకు రెగ్యులరైజ్ చేస్తున్నరు. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్‌‌ చేసుకుంటూ పోయినంక పర్మిషన్‌ ఎందుకని హైకోర్టు అన్న మాటలతో ప్రభుత్వానికి తలదించుకున్నట్లయిం ది. అందుకే ఇక ఎట్టి పరిస్ థితుల్లో అక్రమ కట్టడాలను అనుమతించం. ఎవరైనా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తే నోటీసులు ఇచ్చుడు ఉండదు.. ఇక కూల్చుడే” అని స్పష్టంచేశారు.

మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ కొత్త డోర్ నంబర్

మున్సిపాలిటీల్లో బర్త్‌‌ సర్టిఫికెట్‌ , డెత్‌‌ సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో ఇవ్వకుం టే స దరు అధికారి సర్వీస్‌‌ నుంచి రిమూవ్‌ అవుతారని సీఎం పేర్కొన్నా రు. మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కొత్త డోర్‌‌ నంబర్లు ఇస్తామని, వాటికి క్యూ ఆర్‌‌ కోడ్‌‌ ఉంటుందని, ఇది ప్రజల రక్షణ కోసమేనని తెలిపారు. పబ్లిక్‌‌ టాయిలెట్లను మున్సిపాలిటీలే కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. శ్మశానవాటికల కోసం తప్పనిసరిగా సొం త నిధుల నుంచి స్థలాలు కొనుగోలు చేయాలన్నా రు. హైదరాబాద్‌ తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో వెజ్‌‌, నాన్‌ వెజ్‌‌ మార్కె ట్లను నిర్మిం చాలని, మున్సిపల్‌‌ బడ్జెట్‌ లో 10 శాతం నిధులను కేవలం మొక్కల పెం పకం కోసమే కేటాయిం చాలని సూచిం చారు. మున్సిపాలిటీల్లో 60 మందితో నాలుగు పౌర కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. యూత్‌‌ కమిటీ, మహిళాకమిటీ, సీనియర్‌‌ సిటి జన్స్‌‌ కమిటీ, మేధావులు రచయితల కమిటీని నియమిం చాలని, ఒక్కో కమిటీలో 15 మంది ఉండేలా చూడాలన్నారు. మున్సిపల్‌‌ చైర్మన్‌ , కమిషనర్‌‌ హాజరయ్యే ఈ కమిటీల సమావేశంలో వార్డుల సమస్యలను చర్చిస్తారని సీఎం చెప్పారు.