V6 News

పింక్ కలర్ పెన్ పైన కేసీఆర్ ఫొటో.. ఓటర్లను ప్రలోభపెడుతున్న ఏజెంట్

పింక్ కలర్ పెన్ పైన కేసీఆర్ ఫొటో.. ఓటర్లను ప్రలోభపెడుతున్న ఏజెంట్

GHMC ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఓ పోలింగ్ సెంటర్ లో సీఎం కేసీఆర్ ఫొటోతో ఉన్న పెన్ ను కన్పించింది. పోలింగ్ ఏజెంట్స్  ఆ పెన్ ను యూజ్ చేస్తుండటాన్ని గమనించిన మరో పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్… ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ అధికారులు కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారన్నారు. ఈ ఘటన వివేకానంద నగర్ డివిజన్ లో జరిగింది.

27, 28 పోలింగ్ సెంటర్లలో టీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్స్ సీఎం కేసీఆర్ ఫొటో ఉన్న పింక్ పెన్నును యూజ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన మరో పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్… పోలింగ్ అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని…. పెన్నులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.