ఈ సారి 95 నుంచి 105 సీట్లు.. రాస్కోండి

ఈ సారి 95 నుంచి 105 సీట్లు.. రాస్కోండి

ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పనిచేస్తున్నాడని.. తప్పేంటని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. దేశంలో పరివర్తన కోసం ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తానన్నారు. ఏడేనిమిదేళ్ల నుంచి ప్రశాంత్ కిషోర్ తో తనకు ఫ్రెండ్ షిప్ ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకుని పనిచేయబోడన్నారు. ప్రశాంత్ కిషోర్ 12 రాష్ట్రాల్లో పనిచేశాడన్నారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తని..డబ్బులు తీసుకోడని.. మంచోడన్నారు. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడే వారికి మతిలేదని..వారికి ఏ స్థాయి లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయడని.. చెప్పిందే చేస్తడన్నారు.  ఈ సారి 95 నుంచి 105 సీట్లు పక్కా.. రాస్కోండన్నారు కేసీఆర్.