కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ప్రేమేందర్ రెడ్డి దగ్గర కోట్లు ఖర్చు పెట్టే సామర్ధ్యం లేదు కానీ విద్యార్థి దశ నుంచి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే పోరాట ఫటిమ ఉందన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని చైతన్య డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఇంటలెక్చువల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలనే పట్టుదల ఉన్న ప్రేమేందర్ రెడ్డి ని ఎమ్మెల్సీ గా గెలిపించి శాసనమండలి కి పంపించాలని ప్రజలను కోరారు బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలన నడుస్తోందని…ఆ పాలన అంతం చేయాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని… అప్పుల కుప్పగా మార్చారని తెలిపారు. అంతేకాదు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.

కేసీఆర్ నేర్పిన భాషనే ఆయనకే అప్పగిస్తున్నానన్నారు బండి సంజయ్. ఆయనకు సంస్కారం లేదని టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటే నాకు కూడా సంస్కారం లేదని ఒప్పుకుంటానని తెలిపారు. ఓట్ల కోసం ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. TRSకు ఓటు వేయకుంటే పించన్ రాదు, రైతు బంధు రాదు, రేషన్ బియ్యం రావాని ప్రజలను ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా గెలిచానన్న బండి సంజయ్.. పతకాలు ఆగాయా… ఆపితే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బండి. మేధావులు ఆలోచన చేయాలన్నారు. ప్రజలను చైతన్య పరిచి నిజాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. TRS ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రైవేట్ టీచర్ల జీవితాలను ఆగం చేస్తున్న పాపం కేసీఆర్ కు తగులుతుందన్నారు. వాళ్లు కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇచ్చిన మాట పై నిలబడి దేశ సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమన్నారు.

370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణ కోసం మార్గం సుగమం చేసిన ఘనత ప్రధాని మోడీదన్నారు ఎంపీ బండి సంజయ్. పవిత్ర దేశం ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనుడు మోడీ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమించిన కరసేవకుల త్యాగాలు వృధాగా పోనీయమన్నారు. దేశం గురించే ఆలోచించామాని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.

దేశం కోసం త్యాగాలకు వెనుకాడని బీజేపీ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. 2023 లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందిని తెలిపారు బండి. భారత మాతాకు జై అనని.. జాతీయ గీతం ఆలపిచని MIM పార్టీ సెక్యులర్ పార్టీ అని… దేశం కోసం ప్రాణాలు పణంగా పట్టే బీజేపీ పార్టీని మతతత్వ పార్టీ అనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు బండి సంజయ్.