దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ : కేసీఆర్

దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ : కేసీఆర్

దేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ వన్ గా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లాలో కలెక్టర్ రేట్,  ఎస్సీ కార్యాలయం,సమీకృత భవనాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. నాణ్యమైన  కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా బాగ లేవన్నారు. ఉమ్మడి పాలనలో మంజీరా నది దుమ్ముకొట్టుకుపోయిందని విమర్శించారు.

పరిపాలన చేతకాదంటూ ఉమ్మడి రాష్ట్రంలో కొందరు ఎగతాళి చేసేవారని..  కొత్తగా ప్రారంభించుకుంటున్న ఆఫీసులే వాళ్లకు నిదర్శనమన్నారు కేసీఆర్.   తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందన్నారు.  అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమయ్యిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నంబర్ వన్ గా  ఉందన్నారు.   వచ్చే రోజుల్లో పెన్షన్ పెంచుతామని.. దివ్యాంగుల పింఛన్ రూ.4016 కు పెంచామని చెప్పారు.   రాష్ట్రంలో 50 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారని వెల్లడించారు.