యాదాద్రికి సీఎం

యాదాద్రికి సీఎం

ఆలయ పునరుద్ధరణ పనుల పరిశీలన

హైదరాబాద్‌, వెలుగు : లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకోవడానికి సీఎం కేసీఆర్‌ యాదాద్రి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో కేసీఆర్… ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన యాదగిరి గుట్టకు బయల్దేరి వెళ్లారు. ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

మొదట రాయిగిరి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులు, దాని పక్కన జింకల అభయారణ్యం పనులను పరిశీలించారు. తర్వాత బస్వాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్షించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నమహా సుదర్శన యాగం కోసం గండిచెరువు పక్కన ఉన్న 100 ఎకరాల స్థలాన్ని సీఎం పరిశీలించారు. అలాగే యాగం నిర్వహణ, వీఐపీలు,వీవీఐపీల బస, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు.

తర్వాత రింగ్ రోడ్డు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌,టెంపుల్ సిటీ, ఇతర అభివృద్ధిపనులను పరిశీలించారు సీఎం. మధ్యాహ్న భోజనం తర్వాత ఆలయ పునరుద్ధరణ పనులపై అధికారులతో కాసేపు సమీక్షిస్తారు.. మధ్యాహ్నం  2 గంటలకు యాదగిరిగుట్ట నుంచి బయల్దేరి 3 గంటలకు ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.