- ఎండిన పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయల్దేరి కరీంనగర్ రూరల్ మండలం మగ్దంపూర్ కు 10.30 గంటలకు రోడ్డు మార్గంలో చేరుకుని ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో లంచ్ చేసి 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లికి బయల్దేరుతారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. ఆపై శభాష్ పల్లి దగ్గర మిడ్ మానేరు రిజర్వాయర్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు తిరుగు పయణమవుతారు.