
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి చెందిన చెస్ ప్లేయర్ ఉప్పల ప్రణీత్ (16) 'గ్రాండ్ మాస్టర్' హోదా అందుకోవడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్‌ను, అతడి తల్లిదండ్రులను సీఎం సోమవారం సెక్రటేరియెట్‌కు పిలిపించుకుని అభినందించారు. ఈ సందర్భంగా ప్రణీత్‌ను దీవించిన కేసీఆర్.. అతను సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగేందుకు కావాల్సిన ట్రైనింగ్, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సాయంగా ప్రకటించారు. భవిష్యత్ లో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, దేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. మరోవైపు..చెస్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ‘విమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గు ర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19) ను సీ ఎం అభినందించారు. ఆమె శిక్షణకు, ఇతర ఖ ర్చుల కోసం రూ. 50 లక్షలను ప్రకటించారు.