ఇవాళ (అక్టోబర్​ 17న) సిరిసిల్ల, సిద్దిపేటకు కేసీఆర్‌.. 

ఇవాళ (అక్టోబర్​ 17న) సిరిసిల్ల, సిద్దిపేటకు కేసీఆర్‌.. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం (అక్టోబర్​ 17వ తేదీన) సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా సిరిసిల్ల, ఆ తర్వాత సిద్దిపేటలో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. 

ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిసిల్ల మొదటి బైపాస్‌రోడ్డులో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో విశాలమైన స్థలంలో సభకు బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేశారు.

సిద్దిపేట శివారులోని నాగదేవత గుడి బైపాస్‌లో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం (అక్టోబర్​ 16న) సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. సుమారు 20 వేల మంది బైక్‌ ర్యాలీతో సభా ప్రాంగణానికి రానున్నారు. ప్రాంగణం చుట్టూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కటౌట్లు పెట్టారు.