ఐఏఎస్ రూల్స్ మార్పుపై ప్రధానికి కేసీఆర్ లేఖ

V6 Velugu Posted on Jan 24, 2022

హైదరాబాద్: కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్ కేడర్ రూల్స్ మార్పుపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన నిబంధనలు రాష్ట్రాల హక్కుల్ని హరించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించే ఉన్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అనుమతి లేకుండానే ఐఏఎస్ అధికారులను డిప్యూటేషన్ పై తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగానే కేంద్రం ప్రతిపాదించిన సవరణలను పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, జార్ఖండ్ సీఎం  హేమంత్ సోరెన్ తదితరులు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాశారు. నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్రాల్లో పరిపాలన చిక్కుల్లో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

 

Tagged Telangana, pm modi, CM KCR, protest, rules, ias cadre

Latest Videos

Subscribe Now

More News