
అన్నింటిపైనా తన పేరుండాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. గతంలో హెరిటేజ్ భవనాలు చరిత్రకు నిదర్శనమన్న కేసీఆర్.. ప్రస్తుతం వాటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ సెక్షన్ ప్రకారం గవర్నర్ చేతిలో ఉంటాయని…దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హొం మంత్రిని కలిశామన్నారు. చింతమడకకు కావాలంటే సొంత నిధులు ఇవ్వాలని…ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు.