కేసీఆర్​ పాలనలోనే ఎక్కువ నష్టం : ఆది శ్రీనివాస్

కేసీఆర్​ పాలనలోనే ఎక్కువ నష్టం : ఆది శ్రీనివాస్

 ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కంటే, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో ఎక్కువ నష్టపోయామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం, మంత్రులు, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు మంగళవారం  ఉదయం 10 గంటలకు అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరుతామని సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు చేరుకొని ఐదు గంటల వరకు పరిశీలన ఉంటుందని, ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనమవుతామని తెలిపారు. రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటామని వెల్లడించారు.