ఓటీటీలోకి ‘KD: ది డెవిల్’.. ధ్రువ సర్జా, సంజయ్ దత్‍ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

 ఓటీటీలోకి ‘KD: ది డెవిల్’..  ధ్రువ సర్జా, సంజయ్ దత్‍ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా, బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్-ఇండియా మూవీ ‘KD: ది డెవిల్’ (KD: The Devil). బాక్సాఫీస్ వద్ద ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను నుంచి పాజిటివ్ టాక్  ను సొంతం చేసింది.  ప్రముఖ దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో విడుదలై మాస్ ఆడియన్స్‌ను ఊపేసింది. ఇక ఇప్పుడు ఈ ‘డెవిల్’ డిజిటల్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యాడు.  లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 వేదికగా జూన్ 5, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

కథేంటంటే..

పవర్, లాయల్టీ, మోసం.. ఈ మూడింటి చుట్టూ తిరిగే పక్కా రా అండ్ రస్టిక్ స్టోరీ ఇది. చదువుకోకుండా, లైఫ్‌ను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే కాళీదాస అలియాస్ కేడీ (ధ్రువ సర్జా) అనే కుర్రాడి కథ. అన్నయ్య ధర్మ ఎప్పుడూ కేడీని తక్కువ చేసి చూస్తుంటాడు. చిన్నప్పటి నుండి కేడీకి ఒక రౌడీ అంటే విపరీతమైన ఇష్టం. ఆయనే పోలీస్ వ్యవస్థను సైతం గడగడలాడించే గ్యాంగ్‌స్టర్ ధాక్ దేవా (సంజయ్ దత్). ఆయన్ని ఒక దేవుడిలా ఆరాధిస్తాడు కేడీ.

ఈ లోపు కేడీ లైఫ్‌లోకి ఫుల్ ఫైర్ ఉన్న ‘మచ్చు లక్ష్మి’ (రీష్మా నానయ్య) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరి ఎనర్జీ మ్యాచ్ అవ్వడంతో లవ్‌లో పడతారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, కొన్ని నాటకీయ పరిణామాల వల్ల కేడీ ఫ్యామిలీ.. ధాక్ దేవా నడిపించే క్రూరమైన క్రైమ్ ప్రపంచంలోకి లాగబడుతుంది. ఆ తర్వాత కేడీకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. తను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఐడల్ (ధాక్ దేవా) వల్లే సమాజానికి, తన కుటుంబానికి ఎంతటి వినాశనం జరగబోతుందో తెలుసుకుంటాడు. ఒక అల్లరి కుర్రాడు.. తన వారి కోసం ‘డెవిల్’గా ఎలా మారాడు? తన రోల్ మోడల్‌ను ఎలా ఎదిరించాడు? అనేదే మిగిలిన కథ.

 క్రేజీ ఎలిమెంట్స్

ఈ సినిమాలో శిల్పా శెట్టి, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, జిస్సు సేన్‌గుప్తా, పి. రవిశంకర్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. వీరికి తోడు కిచ్చా సుదీప్, నోరా ఫతేహి స్పెషల్ అప్పియరెన్స్‌తో సినిమాకు మరింత క్రేజ్ తెచ్చారు. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ జన్య అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగా, విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది. సంకేత్ ఆచార్ ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. థియేటర్లలో యాక్షన్ షేక్ చేసిన ఈ ‘డెవిల్’.. జూన్ 5న మీ ZEE5 స్క్రీన్స్‌పై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.