గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు పెట్టండి

గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు పెట్టండి

హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు వర్క్​సైట్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని గోదావరి రివర్​ మేనేజ్​ మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ)ను ఎన్జీటీ చెన్నై బెంచ్​ ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బద్దం భాస్కర్​రెడ్డి తదితరులు దాఖ లు చేసిన పిటిషన్​ను ఆగస్టు 28న ఎన్జీటీ చెన్నై బెంచ్​ జ్యూడీషియల్​ మెంబర్​ జస్టిస్ ​పుష్ప సత్యనారాయణ, ఎక్స్​పర్ట్​ మెంబర్ ​సత్య గోపాల్​విచారించారు. విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలతో కూడి న సర్టిఫైడ్ ​కాపీని మంగళవారం రిలీజ్ ​చేశారు. 

గౌరవెల్లి నుంచి 1.41 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతులు ఉండగా దాన్ని 8.23 టీఎంసీ లకు పెంచారని, ఇందుకు ఎలాంటి అను మతులు తీసుకో లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెంచడంతో అదనంగా 2 వేల హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్​అడ్వొకేట్​జనరల్​ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు.. ఆయా పనులకు సంబంధించిన ప్రొటెక్షన్​వర్క్స్ మాత్రమే చేస్తున్నామని తమ ఎదుట ఒప్పుకున్నారని తెలిపారు. 

అయితే అన్ని అనుమతులు తీసుకునే వరకు ప్రాజెక్టు పనులు చేయొద్దన్న తమ ఆదేశా లను ఇది ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తమ ఆదేశాలను ఇకపై ఉల్లంఘిం చకుండా ప్రాజెక్టు వర్క్​సైట్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని జీఆర్ఎంబీని ఆదేశించారు.