Yoga Tips: గంటల కొద్దీ యోగా చేస్తున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి

Yoga Tips: గంటల కొద్దీ యోగా చేస్తున్నారా? ఇవి గుర్తుపెట్టుకోండి

ఫిట్ నెస్, రిలాక్స్ కోసం యోగ చేస్తారు చాలామంది. కొందరు మొదట్లో చూపినంత ఇంట్రెస్ట్ తరువాత చూపించరు. దాంతో అనుకున్న రిజల్ట్ రాదు. ఇలాకాకుండా ఉండాలంటే యోగ చేసేటప్పుడు ఏమేం గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాడు యోగ మాస్టర్ అక్షర్.


* యోగ చేసేవాళ్లు రొటీన్ ని ఫాలో కావాలి. 

* టైమ్ ఉంది కదా అని ఎక్కువ సేపు యోగ చేయొద్దు. 

* సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం వంటివి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. వాటిని చేసేందుకు పర్టిక్యులర్ టైం ఉంటుంది. 

* యోగ చేసేముందు వామప్ చేయాలి. కాలి మడమలు, మోకాళ్లు, మెడని అటుఇటు తిప్పాలి. ఇలా చేస్తే గాయాలు కావు. 

* ఇవే కాకుండా హెల్దీఫుడ్ తినడం, చాలినంత నిద్రపోవడం చాలా ముఖ్యం.