రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్ ..రిలీజ్ ఎపుడంటే.?

రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్ ..రిలీజ్ ఎపుడంటే.?

 

కీర్తి సురేష్​  టైటిల్ రోల్‌‌‌‌లో నటించిన చిత్రం ‘రివాల్వర్ రీటా’.  జే.కే చంద్రు  దర్శకత్వం వహించాడు.  తెలుగు,  తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌‌‌‌కుమార్, సునీల్,  అజయ్ ఘోష్, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. 

తాజాగా ఫైనల్ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని  నవంబర్ 28న తెలుగు, తమిళ భాషల్లో  వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు  ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కీర్తి సురేష్ గులాబీని పట్టుకుని చిరు నవ్వులు చిందిస్తుంటే ఆమెపై విలన్స్ గన్స్ గురిపెడుతూ కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.  క్రైమ్‌‌‌‌ కామెడీతో ఈ చిత్రం ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్  చేయబోతోందని ఈ పోస్టర్ ద్వారా  అర్థమవుతోంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందించాడు.  ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  సుదన్ సుందరం,  జగదీష్ పళనిస్వామి నిర్మించారు.