కీసర, వెలుగు: ఈ నెల 6 నుంచి 11 వరకు కీసర రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం కీసర గుట్టకు వెళ్లిన మేడ్చల్కలెక్టర్ గౌతమ్, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డీసీపీ పద్మజ, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అడిషనల్కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, విజయేందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈఓ నరేందర్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆలయం వద్ద క్యూలైన్లు, గుట్టకు చేరుకునేలా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.
