
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కీసర తహశీల్దార్ నాగరాజు అవినీతి వ్యవహారం కేసులో అధికారులు మరో సారి షాకయ్యారు. నాగరాజు అక్రమాల చిట్టాను బయటకు లాగే క్రమంలో ఏసీబీ అధికారులు అతని పేరుతో బ్యాంకుల్లో ఉన్న నగదుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అతని ఇంటికి వెళ్లి బ్యాంకు లాకర్ల వివరాల కోసం అధికారులు నాగరాజు భార్య స్వప్నను ప్రశ్నించగా.. ఆమె బ్యాంకు వివరాలు తప్పుగా చెప్పి వారిని బురిడీ కొట్టించింది.
సీజ్ చేసిన బ్యాంక్ లాకర్… అల్వాల్ కెనరా బ్యాంక్‌లో లాకర్ ఉందని చెప్పడంతో అధికారులు హడావిడిగా అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ నాగరాజు పేరుతో ఎలాంటి లాకరు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. తిరిగి ఆమె ఇంటి వద్దకు వెళ్లగా… వారు వచ్చేలోపే ఆమె అక్కడి నుంచి పారిపోయింది. తప్పించుకోవడానికే ఆమె అబద్దం చెప్పిందని గుర్తించి వెంటనే ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.