బీ ఫారం ఇవ్వలేదని టీఆర్ఎస్‌కు మరో నాయకుడు గుడ్‌బై

బీ ఫారం ఇవ్వలేదని టీఆర్ఎస్‌కు మరో నాయకుడు గుడ్‌బై

మేడ్చల్: మున్సిపల్ ఎన్నికల సీట్ల లొళ్లి రోజురోజుకు హీటెక్కుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక పార్టీ నాయకులు సీటు ఇవ్వలేదని ఆయా పార్టీలకు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కీసర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్టారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నాగారంలోని 8వ వార్డు నుంచి జనరల్ మహిళ కోటాలో తన భార్యకు కౌన్సిలర్ సీటు కోసం కృష్టారెడ్డి ప్రయత్నించాడు. కానీ, టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఆయనకు ఆ సీటు కన్ఫర్మ్ చేయలేదు. దాంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీసర మరియు నాగారం మండల పార్టీ ప్రెసిడెంట్లకు లేఖ రాశారు. అందులో తనకు బీ ఫారం ఇవ్వకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. 2019 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా సీటు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీ ఫారం ఇవ్వకుండా తనను మోసం చేశారని పేర్కొన్నారు. ఈ రాజీనామ లేఖను జిల్లా అధ్యక్షుడితో పాటూ.. రాష్ట్ర అధ్యక్షుడికి కూడా పంపిస్తానని ఆయన అన్నారు.

keesara-trs-president-resign-for-trs-party-for-the-objection-of-b-form-in-municipal-elections