కీసర గుట్ట ఆదాయం రూ.1.20 కోట్లు

కీసర గుట్ట ఆదాయం రూ.1.20 కోట్లు

కీసర, వెలుగు: కీసరగుట్ట కార్తిక మాసం హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు దాటింది. మంగళవారం ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. గత నెల అమావాస్య (అక్టోబర్ 22) నుంచి ఈ నెల అమావాస్య (నవంబర్ 20) వరకు కార్తిక మాసంలో వచ్చిన ఆదాయం మాత్రమే లెక్కించినట్లు ఈవో తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు పూర్తయింది. ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు  పాల్గొన్నారు.