ట్రక్కు బీభత్సం..48 మంది మృతి

ట్రక్కు బీభత్సం..48 మంది మృతి

కెన్యాలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  ఆసుపత్రులకు తరలించారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

కెరిచో, నకురు పట్టణాల మధ్య హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అనేక మినీబస్సుల శిధిలాలు, బోల్తా పడిన ట్రక్కు కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతి వేగంగా వెళ్తున్న ట్రక్కు..నియంత్రణ కోల్పోయి 8 వాహనాలు, మోటారుసైకిళ్లు, రోడ్డు పక్కన ఉన్న పాదచారుల  ఢీకొట్టింది. లోండియాని జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతంలో  ఈ ప్రమాదం  చోటు చేసుకుంది. జరిగింది. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని కెన్యా రవాణ శాఖ మంత్రి కిప్ఛుంబా ముర్కో మెన్ ట్విట్టర్ లో  తెలిపారు.  సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, సహాయ కార్యకర్తలు, కెన్యా రెడ్ క్రాస్ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టారు.