నిజంగా చేతబడి ఉందా..? హోటల్ గదిలో ఒకేసారి ముగ్గురు మృతి

నిజంగా చేతబడి ఉందా..? హోటల్ గదిలో ఒకేసారి ముగ్గురు మృతి

ఓ జంట, వారి స్నేహితురాలు..ముగ్గురు ఒకేసారి ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ముగ్గురు మణికట్లు మీద కోతలతో రక్తస్రావమై చనిపోయారు. హోటల్ గదిలో వారు వదిలిన స్యూసైడ్ నోట్ చూస్తూ ఎన్నో అనుమానాలు.. వారి బంధువులు చెప్పింది కూడా అదే.. చేతబడికి బలయ్యారు అని..నిజంగా చేతబడి ఉందా..ఆ ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు..? పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు..ఓ జంట.. వారి స్నేహితురాలు అరుణాచల్ ప్రదేశంలోని  జిరో పట్టణంలో మంగళవారం (ఏప్రిల్ 2న) ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ముగ్గురు ఒకే విధంగా చనిపోయారు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.. ఎలాంటి సమస్యలు లేవు.. అయినా ముగ్గురు చేతి మణికట్టు కోసుకొని  తీవ్ర రక్త స్రావం కావడంతో చనిపోయారు.. వీరు రాసిన పెట్టిన సూసైడ్ లెటర్ చూసి పోలీసులకు అనేక రకాల అనుమాలు కలిగాయి. 

చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు కొట్టాయం జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యులు నవీన్ థామస్(35), అతని భార్య దేవి (‘35) గా గుర్తించారు. మరో వ్యక్తి వారి స్నేహితురాలు స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఆర్య బినాయర్ (29) గా గుర్తించారు. ముగ్గురు మార్చి 28న హోటల్ కు వచ్చారు.. అప్పటినుంచి హోటల్ గదినుంచి బయటికి రాలేదు.. 
అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గూరు శవాలై కనిపించారు. ఆశ్చర్యమేమిటంటే.. వారు ముగ్గురు చేతికట్టు కత్తితో కట్ చేసుకొని రక్తస్రావం కావడంతో చనిపోయారు.

ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న హోటల్ గదిలో దొరికి సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ మాకు ఎలాంటి అప్పులు లేవు.. మాకు ఎటువంటి సమస్యలూ లేవు.. మేం ఉండాల్సిన చోటికి వెళ్తున్నాం అని లెటర్ లో రాసిపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.. 
మృతుల్లో ఒకరైన దేవి ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ బాలన్ మాధవన్ కుమార్తె.  బాలన్ మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ , దేవీ దంపతులు సంతోషంగా  జీవిస్తున్నారని, వైవాహిక సమస్యలు లేవని చెప్పారు. 

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..సూసైడ్ నోట్ లో రాసిన దాన్ని బట్టి బంధువులు వారు చేతబడికి బలైపోయారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ అనుమానాస్పద మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కు పంపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది.