కేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు

కేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు

కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీసులు శనివారం తెలిపారు. గోవింద్ రాజ్ పలు చోరీ కేసుల్లో దోషి. 

జైలు ఆవరణలోనే గార్డెనింగ్ పనుల కోసం ఖైదీలను ప్రధాన కాంప్లెక్స్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా అతను తప్పించుకున్నాడు. "మెయిన్ బ్లాక్ నుంచి జైలు కాంప్లెక్స్‌లోని గార్డెన్ ప్రాంతానికి తీసుకెళ్లిన ఖైదీలలో అతను ఉన్నాడు. గార్డులు చూడనప్పుడు అతను తప్పించుకున్నాడు" అని వియ్యూరు పోలీసులు తెలిపారు.

ALSO READ : నడుస్తున్న కారులోంచి చెలరేగిన మంటలు.. కాలిబూడిదైన కారు

దీంతో జైలు అధికారులు పోలీసులకు సమాచారం అందించి పారిపోయిన ఖైదీని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.